Heavy Rains In Mumbai: ముంబైలో 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసిన ఐఎండీ

Heavy Rains In Mumbai: నాలుగురోజుల పాటు ముంబైలో భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Update: 2021-06-10 03:36 GMT

Heavy Rains In Mumbai:(The Hans India) 

Heavy Rains In Mumbai: ఇపుడిపుడే కరోనా నుండి తేరుకుంటున్న మహారాష్ట్ర రాజధాని ముంబై ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులగా కురిసిన వర్షాలతో ముంబై మొత్తం జలమయమైంది. ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచనలు సైతం చేశారు. ఈ క్రమంలో ముంబై వాసులకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగురోజుల పాటు ముంబైలో భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ముంబై నగరంతోపాటు శివారు ప్రాంతాలు, థానే, పాల్ఘార్, రాయ్ గడ్ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఆరంజ్ అలర్ట్' జారీ చేసింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరమంతా జలమయమైంది. వరదలతో రైళ్లను సైతం రద్దుచేశారు. పాల్ఘార్‌లో వంతెన సైతం కూలింది. భారీవర్షాలతో పలు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై పోలీసులు సూచించారు.

కాగా.. ముంబైలోని శాంతాక్రజ్ వద్ద ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేవలం ఆరు గంటల్లో 164.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో బుధవారం 32.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నేతాజీ పాల్కర్ చౌక్, ఎస్వీ రోడ్, బహేరాంబాగ్ జంక్షన్, సక్కర్ పంచాయతీ చౌక్, నీలం జంక్షన్, గోవాండి, హిందమాతా జంక్షన్, ఇక్బాల్ కమానీ జంక్షన్, ధారావి రెస్టారెంట్, ధారావి ప్రాంతాల్లో వర్షపునీటితో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

Tags:    

Similar News