Indian Railway: ట్రైన్‌లో మీ రిజర్వ్‌ సీటుని ఎవరైనా ఆక్రమించారా.. నిబంధనలు తెలుసుకోండి..!

Indian Railway: ట్రైన్‌లో మీ రిజర్వ్‌ సీటుని ఎవరైనా ఆక్రమించారా.. నిబంధనలు తెలుసుకోండి..!

Update: 2022-07-24 09:15 GMT

Indian Railway: ట్రైన్‌లో మీ రిజర్వ్‌ సీటుని ఎవరైనా ఆక్రమించారా.. నిబంధనలు తెలుసుకోండి..!

Indian Railway: ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలని అందిస్తోంది. అంతేకాదు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరానికి ట్విట్టర్‌ ద్వారా సహాయం చేయడం ప్రారంభించింది. డిజిటల్ ఇండియా వల్ల మీరు మీ రైలు టిక్కెట్ల నుంచి రైలు లోపల ఆహారం వరకు ప్రతిదీ ఆర్డర్ చేయవచ్చు. అయితే మీరు రిజర్వ్‌ చేసుకున్న సీటుని ఎవరైనా ఆక్రమిస్తే ఏం చేయాలనేది చాలా మందికి తెలియదు. ఇలాంటి ఫిర్యాదులు తరచూ రైల్వేశాఖకు ఎదురవుతాయి. ఈ సందర్భంలో రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

ఒకరు బుక్ చేసిన సీటును మరొకరు స్వాధీనం చేసుకునే కేసులు రైల్వేలో తరచుగా వస్తుంటాయి. ఈ పరిస్థితిలో మీ సీటుపై కూర్చున్న వ్యక్తి దానిని ఖాళీ చేయకుండా గొడవ పడుతుంటాడు. ఈ పరిస్థితిలో మీరు రైల్వేకి ఫిర్యాదు చేయడం ద్వారా ఆ వ్యక్తిని మీ సీటు నుంచి పంపించవచ్చు. ఎవరైనా ప్రయాణీకుల రిజర్వ్ సీటు లేదా బెర్త్‌ను ఎవరైనా అక్రమంగా ఆక్రమించినట్లయితే మొదట ఆ విషయాన్ని రైలులోని టీటీఈకి తెలపాలి. అంతేకాదు దీని గురించి మీరు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139లో ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా మీరు 'రైల్వే మదద్'లో ఫిర్యాదు చేయవచ్చు.

1. ముందుగా https://railmadad.indianrailways.gov.in పై క్లిక్ చేయండి.

2. మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి సెండ్ OTPపై క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు మీ మొబైల్‌లో వచ్చిన OTPని నమోదు చేయాలి.

4. మీ టికెట్ బుకింగ్ PNR నంబర్‌ను నమోదు చేయాలి.

5. ఇప్పుడు టైప్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ సమస్యని ఎంచుకోండి.

6. ఈవెంట్ తేదీని ఎంచుకోండి.

7. ఇప్పుడు మీ ఫిర్యాదును వివరంగా తెలపండి.

8. ఆ తర్వాత Submitపై క్లిక్ చేయండి.

9. కొన్ని నిమిషాల్లో మీ సమస్యని పరిష్కరిస్తారు.

Tags:    

Similar News