అసోంలో ఘనంగా ఎయిర్‌ఫోర్స్‌డే ప్రదర్శనలు

వైమానిక దళ దినోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా అసోం రాజధాని గువాహటిలో భారత వాయుసేన నిర్వహించిన ప్రదర్శనలు ఔరా అనిపించాయి.

Update: 2025-11-10 06:32 GMT

అసోంలో ఘనంగా ఎయిర్‌ఫోర్స్‌డే ప్రదర్శనలు

వైమానిక దళ దినోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా అసోం రాజధాని గువాహటిలో భారత వాయుసేన నిర్వహించిన ప్రదర్శనలు ఔరా అనిపించాయి. వాయుసేన పూర్తి స్థాయి కార్యకలాపాల సామర్థ్యాలను చాటేలా సైనిక, యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి. చికెన్‌ నెక్ కారిడార్ సమీపంలో వాయుసేన శక్తిసామర్థ్యాల ప్రదర్శన శత్రువులకు నిద్రలేని రాత్రులు మిగులుస్తుందని ముఖ్యమంత్రి హిమంత పేర్కొన్నారు.

వాయుసేన 93వ వార్షికోత్సవం పురస్కరించుకుని ‘ఫ్లయింగ్‌ డిస్‌ప్లే 2025’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రఫేల్‌, సుఖోయ్‌-30, మిగ్‌-29, మిరాజ్‌తో పాటు పలు హెలికాప్టర్లతో విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శన వీక్షించేందుకు నగరవాసులు పెద్దఎత్తున తరలివెళ్లారు. 

Tags:    

Similar News