జమ్మూలో గ్రేట్ రెస్క్యూ లైవ్ ఆపరేషన్..ఇద్దరినీ కాపాడిన రెస్క్యూ టీం

జమ్ములోని తావీ నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు IAF రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. నిర్మాణంలో ఉన్న వంతెన మధ్యలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.

Update: 2019-08-19 08:56 GMT

జమ్ములోని తావీ నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు IAF రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. నిర్మాణంలో ఉన్న వంతెన మధ్యలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వరద క్రమక్రమంగా పెరుగుతుండటంతో వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన IAF ఇద్దరిని కాపాడేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

వంతెన వద్ద సిమెంట్ నిర్మాణంపై బిక్కుబిక్కుమంటు ఉన్న ఇద్దరి వద్దకు తాడు సహాయంతో జవాను చేరుకున్నాడు. ఇద్దరిని క్షేమంగా హెలికాప్టర్‌లోకి చేర్చేందుకు వారికి సెఫ్టీ వైర్స్ తొడిగారు. అనంతరం ఇద్దరిని తాడు సహాయంతో పైకి లాగారు. వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లి దించారు.

ఇద్దరిని సురక్షితంగా తీసుకువెళ్లిన హెలికాఫ్టర్ వరద మధ్యలో ఉన్న జవాన్ కోసం తిరిగి వచ్చింది. అతడిని కూడా క్షేమంగా తీసుకువెళ్లింది. ఎంతో సాహసోపేతంగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌పై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడిన జవాన్‌ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకున్నారు.

Full View 

Tags:    

Similar News