Aadhaar: ఆధార్‌ కార్డుకి వ్యాలిడిటీ ఉంటుందా.. గడువు ఎప్పుడు ముగుస్తుందంటే..?

Aadhaar: ఆధార్‌ కార్డుకి వ్యాలిడిటీ ఉంటుందా.. గడువు ఎప్పుడు ముగుస్తుందంటే..?

Update: 2022-07-05 04:30 GMT

Aadhaar: ఆధార్‌ కార్డుకి వ్యాలిడిటీ ఉంటుందా.. గడువు ఎప్పుడు ముగుస్తుందంటే..?

Aadhaar Card: ఆధార్‌ లేనిదే ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాలకి ఆధార్‌ చాలా ముఖ్యం. దాదాపు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ కార్డ్ భారతదేశంలోని వ్యక్తులందరికీ ప్రత్యేకమైన గుర్తింపు రుజువు. దీనిని UIDAI జారీ చేస్తుంది. ఇందులో వ్యక్తికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. యూఐడీఏఐ 12 అంకెల నంబర్‌ను జారీ చేస్తుంది. అయితే ఆధార్‌ కార్డుకి వ్యాలిడిటీ ఉంటుందా.. ఒకవేళ ఉంటే అది ఎప్పుడు ముగుస్తుంది. తదితర విషయాలు తెలుసుకుందాం.

ఆధార్ కార్డు ఒక్కసారి జారీ అయితే జీవితాంతం చెల్లుబాటులో ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆధార్ కార్డు చెల్లుబాటులో ఉండదు. అయితే మైనర్ పిల్లల విషయంలో మాత్రం తేడా ఉంటుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బ్లూ ఆధార్ కార్డ్ జారీ చేస్తారు. ఈ కార్డు పిల్లల 5 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే చెల్లుతుంది. ఇందులో పిల్లల బయోమెట్రిక్‌ తీసుకోరు. అయితే తర్వాత ఈ కార్డుని నవీకరిస్తారు.

అయితే ప్రామాణికత కారణంగా ప్రభుత్వం చాలా ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. ఎందుకంటే చాలా మంది వ్యక్తుల పేరిట ఒకటి కంటే ఎక్కువ ఆధార్‌ కార్డులు ఉన్నాయి. చాలా కార్డులు నిష్క్రియంగా మారాయి. మీ కార్డ్ చెల్లుబాటులో ఉందా లేదా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే వెంటనే ఒక్కసారి చెక్‌ చేసుకోండి. ఇందుకోసం UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News