ఇక్కడ చూడండి ..! మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి ఎంత కష్టం వచ్చిందో

మనిషి బతికున్నప్పుడు మాత్రమే కులాలు, మతాలు అనేవి మనల్ని శాసిస్తాయి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది .

Update: 2019-08-22 08:50 GMT

మనిషి బతికున్నప్పుడు మాత్రమే కులాలు, మతాలు అనేవి మనల్ని శాసిస్తాయి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది . మనిషి బతికున్నప్పుడు కాదు అ మనిషి చనిపోయిన అతన్ని ఇంకా అవి వెంటాడుతాయి అని చెప్పేందుకు ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణ ...తమిళనాడులోని ఎన్‌.కుప్పమ్‌ (46) అనే ఓ దళిత వ్యక్తి చనిపోయాడు. దహనసంస్కారాల కోసం అతని మృతదేహాన్ని తమ పొలాల వెంట తీసుకెళ్లేందుకు అక్కడి అగ్రవర్ణాలు నిరాకరించాయి . దీనితో చేసేది ఏమి లేకా అ మృతదేహాన్ని 20 అడుగుల ఎత్తు నుంచి వంతెన కిందకు తాళ్ల సాయంతో దించారు . ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది . 



Tags:    

Similar News