Parliament: పార్లమెంట్ ఉభయసభలు మ.2 గంటల వరకు వాయిదా
Parliament: హిండెన్ బర్గ్ రిపోర్ట్‌పై చర్చించాలని విపక్షాల డిమాండ్
Parliament: పార్లమెంట్ ఉభయసభలు మ.2 గంటల వరకు వాయిదా
Parliament: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఉదయం 11గంటలకు లోక్‌సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. ఆదానీపై హిండెన్ బర్గ్ నివేదిక గురించి చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
BRS, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ విషయంపై లోక్‌సభ, రాజ్యసభలోనూ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే లోక్‌సభ సమావేశం అయిన తర్వాత విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి హిండెన్ బర్గ్ అంశంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీటైంది. సభ్యులు సభా మర్యాదలను పాటించాలని చైర్మన్ ధన్‌కర్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినలేదు. దీంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.