కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది.. రెండు ముక్కలు కాబోతున్న రాష్ట్రం!

Update: 2019-08-05 06:27 GMT

కాశ్మీర్ లో ఏం చేయాలనుకుంటున్నారో కేంద్రం స్పష్టంగా రాజ్యసభలో ప్రకటించేసింది. ప్రకటన వెలువడిన వెంటనే.. రాష్రపతి దానిని ఆమోదించేశారు. పగద్బందీగా ఎక్కడా తొట్రుపాటు లేకుండా తామనుకున్నది కానిచేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది విపక్షాలకు మింగుడుపడని సర్జికల్ స్ట్రైక్. ఎదో చేయబోతున్నారనే అంచనాలు ఉన్నా.. ఇలా చేస్తారనే కచ్చితమైన ఊహ వారికి రానీయలేదు. కేంద్రం... అసలు ఇప్పుడు కేంద్రం రాజ్యసభలో ఏం చెప్పింది? కాశ్మీర్ లో ఏం చేస్తోంది?

ర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేస్తూ మొదటి ప్రతిపాదన చేశారు అమిత్ షా. దీని ప్రకారం కాశ్మీర్ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. ఇప్పుడు కాశ్మీర్ పూర్తిగా భారత దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వలె పార్లమెంట్ చాట్టాలను అమలు చేయాల్సిందే.

దీనితరువాత కాశ్మీర్ ను విభాజిస్తున్నట్టు.. ఓ బిల్లు పెట్టారు. అంటే, ముందు పార్లమెంట్ చట్టాలు అమలు చేసే అవకాశాన్ని తీసుకుని వెంటనే కాశ్మీర్ ను విభజించేశారు.

అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్.. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ, కాశ్మీర్ ఇలా రెండు రాష్ట్రాలుగా కాశ్మీర్ ను విభజిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.


Tags:    

Similar News