Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

Aryan Khan: కాసేపట్లో విచారణ చేపట్టనున్న కోర్టు

Update: 2021-10-14 09:15 GMT

ఆర్యన్ ఖాన్ (ఫైల్ ఇమేజ్)

Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ వాదించింది. తమ విచారణలో ఆర్యన్ వాట్సాప్ లో ఇంటర్ నేషనల్ డ్రగ్స్ కాంటాక్ట్స్ దొరికాయంది. ఆర్యన్ ఖాన్ మీడియేటర్ గా ఉంటూ అక్రమంగా డ్రగ్స్ రవాణా జరిగిందన్న దానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, కోర్టులో ఓ రిపోర్టు కూడా ఎన్సీబీ సమర్పించింది. ఎన్ డీపీఎస్ చట్టం 1985 ప్రకారం ఆర్యన్ ఖాన్ నేరం చేశాడు అనడానికి రుజువులు ఉన్నాయని ఆ రిపోర్టులో ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. విదేశీ డ్రగ్స్ డీలర్స్ తో ఆర్యన్ ఖాన్ లింకులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేలేంతవరకూ ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వొద్దని అధికారులు కోరారు.

ఇదే సమయంలో ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది సైతం తమ వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరకలేదని ఎన్సీబీ అధికారులే రిపోర్టులో రాశారన్నారు. ఆర్యన్ దగ్గర డబ్బులు కూడా లేవని అధికారులు చెప్పారని, మరి డబ్బులు లేనప్పుడు డ్రగ్స్ ను అమ్మడం కానీ కొనడం కానీ ఎలా సాధ్యం అని వాదించారు. అంతే కాకుండా క్రూయిజ్ షిప్ లోకి డ్రగ్స్ తీసుకోవడానికే వెళ్లాడని ఎలా చెప్తారని పలు పాయింట్స్ ను లేవనెత్తారు. ఎన్సీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావిస్తూ, పంచనామాను చదువుతూ వరుస ప్రశ్నాస్త్రాలు సంధించారు అమిత్ దేశాయ్. ఇరువురి వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం విచారణ రేపటికి వాయిదా వేసింది. తదుపరి విచారణ రేపు ఉదయం 11 గంటలకు కొనసాగనుంది.

Tags:    

Similar News