Hemant Soren: జార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సోరెన్ భావోద్వేగ ప్రసంగం
Hemant Soren: తన అరెస్టు జరిగిన జనవరి 31 రాత్రి ఓ కాళరాత్రి అన్న మాజీ సీఎం
Jharkhand Assembly Election Results 2024: కాసేపట్లో జార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ..ఎన్డీఏ, జేఎంఎం మధ్యే టగ్ ఆఫ్ వార్
Hemant Soren: దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన కాళరాత్రిగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన ఆవేదనను వ్యక్త పరిచారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో హేమంత్ సోరెన్ భావోద్వేగంతో ప్రసంగించారు. తీవ్ర ఆవేదనతో అసెంబ్లీలో మాట్లాడిన హేమంత్ సోరె.. ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా కోర్టు ప్రత్యేక అనుమతితో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈడీ అధికారులు, పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ఆయన అసెంబ్లీకి వచ్చారు.
రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే హేమంత్ సోరెన్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం బహుశా దేశంలోనే ఇదే మొదటిదని చెప్పారు. ఈ ఘటనలో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని తాను నమ్ముతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.