అస్సాం, మణిపూర్‌ను ముంచెత్తిన వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు...

Heavy Rains: మణిపూర్‌లోని సేనాపతి జిల్లా చిక్‌మి దగ్గర ట్రక్కు బోల్తా...

Update: 2022-05-17 07:34 GMT

అస్సాం, మణిపూర్‌ను ముంచెత్తిన వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు...

Heavy Rains: అస్సాంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. కొన్నిరోజులుగా దిమా హసావో జిల్లాను భారీ వర్షాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ జిల్లాకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఏడు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగి పడి రోడ్డు, రైలు మార్గాలు మూసుకుపోయాయి. దిటొక్‌చర్రలో చిక్కుకుపోయిన 119 మంది రైలు ప్రయాణికులను వైమానికదళం హెలికాప్టర్లలో సిల్చార్‌కు తరలించింది.

గత పది రోజుల్లో దిమా హసావో జిల్లాలో కొండచరియలు విరిగి పడి నలుగురు మృతి చెందారు. మరోపక్క బ్రహ్మపుత్ర, బరాక్‌ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలను వరదలు చుట్టుముడుతున్నాయి. వరదల ప్రభావంతో 20 జిల్లాల్లోని దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తెలిపింది. మరోవైపు.. అస్సాం, మేఘాలయలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికను కొనసాగిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

భారీ వర్షాలు, వరదలతో మణిపూర్‌ కూడా అతలాకుతలం అవుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మణిపూర్‌లోని సేనాపతి జిల్లా చిక్‌మి దగ్గర వరదల ధాటికి రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఓ ట్రాక్కు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ట్రక్కు లోని సరుకు నదిలో కొట్టుకుపోయింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లారీని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Tags:    

Similar News