Tamil Nadu: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు
Tamil Nadu: ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు * తమిళనాడులో మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్
ఉపరితల ఆవర్తనం వాళ్ళ తమిళనాడు లో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)
Tamil Nadu: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, నాగపట్టణం జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. మధురై నగరంలో కురిసిన కుండపోత వానకు ఇళ్లలోకి నీరు చేరింది.
దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడులో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెన్నైలో 91 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.