Weather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...

Weather Report Today: సాధారణం కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు...

Update: 2022-05-28 02:36 GMT

Weather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన... 

Weather Report Today: మరో రెండు..మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని ఐఎండీ వెల్లడించింది.

రాబోయే ఐదు రోజుల్లో దేశంలో వడగాల్పుల పరిస్థితులు ఉండవని తెలిపింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని.. వచ్చే 2 రోజులు ఆకాశం మేఘావృతమైన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని వెల్లడించింది.

24 గంటల్లో కేరళ తీరం, ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాల ఉనికి పెరిగిందని తెలిపింది. ఈ సారి సాధారణం కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. రెండు, మూడు రోజుల్లో కేర‌ళ‌కు చేరుకోనున్నాయి.

Full View


Tags:    

Similar News