Supreme Court: సీఏఏ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: సీఏఏను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు

Update: 2024-03-19 03:47 GMT

Supreme Court: సీఏఏ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court:  దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయొద్దంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ నెల 12న కోర్టును ఆశ్రయించింది. 2019 నుంచి ఇప్పటివరకు దాఖలైన 195 పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మరో వైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News