Gyanvapi Case: జ్ఞానవాపి కేసు.. అలహాబాద్‌ హైకోర్టు కీలక ఆదేశాలు

Gyanvapi Case: ఏఎస్‌ఐ సర్వేకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ల కొట్టివేత

Update: 2023-12-19 06:11 GMT

Gyanvapi Case: జ్ఞానవాపి కేసు.. అలహాబాద్‌ హైకోర్టు కీలక ఆదేశాలు

Gyanvapi Case: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. జ్ఞానవాపి వివాదంలో ముస్లిం సంస్థలకు చుక్కెదురయ్యింది. ఏఎస్‌ఐ సర్వేకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేసింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్‌ఐ అధికారులు సీల్డ్‌ కవర్‌లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈనెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపై నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించింది.

Tags:    

Similar News