Parliament Attack Threat: డిసెంబర్ 13 లోగా పార్లమెంట్‌పై దాడి చేస్తాం.. గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరిక
Parliament Attack Threat: అఫ్జల్ గురు ఫొటో ఉన్న వీడియోను విడుదల చేసిన గురుపత్వంత్‌సింగ్
Parliament Attack Threat: డిసెంబర్ 13 లోగా పార్లమెంట్‌పై దాడి చేస్తాం.. గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరిక
Parliament Attack Threat: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. పార్లమెంటుపై దాడి చేస్తామంటూ గురుపత్వంత్‌సింగ్ విడుదల చేసిన వీడియో కలకలం సృష్టిస్తోంది. గురుపత్వంత్‌ను హత్య చేయడానికి అమెరికాలో కుట్రలు జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియో రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయి. ఈ క్రమంలో డిసెంబరు 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతామంటూ పన్నూ చేసిన బెదిరింపులను.. భద్రతా సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి. ‘పార్లమెంటు ప్రాంగణం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశాం. 2001వ సంవత్సరంలోనూ డిసెంబరు 13నే పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. దీనికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు ఫొటో ఒకటి పన్నూ విడుదల చేసిన వీడియోలో కనిపించింది.