అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.మోడీ గత అమెరికా పర్యటన హౌడీ మోడీ ఈవెంట్ రికార్డును బద్దలు కొట్టేందుకు కెంచో ట్రంప్ పేరుతో మరో భారీ ఈవెంట్ ను సిద్ధం చేయాలని మోడీ సర్కార్ భావించింది. గుజరాతీ భాషలో కెంచో అంటే ఎలా ఉన్నారని అడగడం.. గుజరాత్ లోని అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంను ప్రపంచంలోకే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రూపుదిద్దిన నేపధ్యంలో ఈ స్టేడియంను ట్రంప్ ప్రారంభిస్తారు.. ఈ వేదికగా ఈవెంట్ జరపాలని ముందు అనుకున్నా.. తాజాగా ఆ పేరు మార్చాలని నిర్ణయించారు.. కెంచో ట్రంప్ కు బదులుగా వెల్కమ్ ట్రంప్ అంటూ ఆ ఈవెంట్ పేరు మార్చేశారు..