గుజరాత్ లో మూడోసారి భూప్రకంపనలు

గుజరాత్ లో మూడు రోజుల వ్యవధిలో మూడు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి.

Update: 2020-06-16 07:36 GMT

గుజరాత్ లో మూడు రోజుల వ్యవధిలో మూడు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయని గుజరాతీ మీడియా నివేదికలు తెలిపాయి. ఇలా రావడం వరుసగా మూడోసారి అని నివేదికల సారాంశం. కచ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 10:49 గంటలకు భూకంపం సంభవించిందని.. దాంతో ఇళ్లలోనుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారని అధికారులు తెలిపారు.

అయితే ఈ ప్రకంపనల వలన ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా నష్టం జరగలేదని తెలిపారు. తక్కువ తీవ్రత కలిగిన ఈ భూకంపం కేంద్రం కచ్‌లోని భచౌ అనే చిన్న పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడే మంగళవారం ఉదయం ప్రకంపనలు సంభవించాయి. కాగా ఆదివారం కూడా గుజరాత్‌లోని 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. పెద్ద నష్టాలు ఏవీ నివేదించబడనప్పటికీ, కచ్ మరియు ఇతర జిల్లాల్లోని కొన్ని ఇళ్ళు పగుళ్ళకు గురయ్యాయి.

Tags:    

Similar News