దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన గుజరాత్ ATS
దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది.
దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన గుజరాత్ ATS
దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది. అహ్మదాబాద్‌లో ముగ్గురు ISI సంస్థకు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేశారు. గుజరాత్‌లో డ్రోన్ ద్వారా పాకిస్తాన్ నుంచి అక్రమంగా తెచ్చిన ఆయుధాలు, ప్రమాదకరమైన రిసిన్ విషాన్ని తయారు చేసే పదార్థాలతో పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ కూడా ఉన్నట్టు వెల్లడించారు.
నిందితుల నుంచి రెండు గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా తుపాకీ, 30 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, రిసిన్ తయారీలో ఉపయోగించే 4 కిలోల క్యాస్టర్ బీన్ మాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిగా ఈ ముగ్గురు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్...ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గుజరాత్ కేంద్రంగా పలు ప్రాంతాలకు ఆయుధాలు సరఫరా చేసినట్టు తెలుస్తోంది.