Sardar Vallabhbhai Patel: ఘనంగా సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి వేడుకలు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏక్తా దివస్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, సీపీ సజ్జనార్ భారతీయుల ఐక్యతను తెలియజేయడమే ఏక్తా దివస్ లక్ష్యం

Update: 2025-10-31 10:50 GMT

Sardar Vallabhbhai Patel: ఘనంగా సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి వేడుకలు

రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్యర్యంలో పీపుల్స్ ప్లాజాలో ఏక్తా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రిటిష్ బానిస చెర నుంచి విముక్తి పొందిన తర్వాత ముక్కలుగా ఉన్న భారత్‌‎ను ఒక్కటి చేసిన సర్దార్ వల్లభాయి పటేల్‌‎ను స్మరించుకుంటూ.. ప్రతి సంవత్సరం ఏక్తా రన్‌ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


ముక్కలుగా ఉన్న స్వతంత్ర భారతాన్ని ఒక్కటి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయి పటేల్. 562 ప్రిన్స్లీ స్టేట్స్‌ని భారత్‌‎లో విలీనం చేసి.. సమైక్య భారతానికి పునాది వేశారాయన. ఆ మహనీయుడి జన్మ దినోత్సవాన్ని రాష్ట్రీయ ఏక్తా దివాస్‌‎గా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.


భారత దేశంలో విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు, భాషలు ఉన్నాయని... అయినా కూడా భారతీయులంతా ఒక్కటే అనే సమైక్య స్ఫూర్తిని తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఏక్తా రన్ ద్వారా సర్దార్ వల్లభాయి పటేల్ సేవలను స్మరించుకుంటూ... ఆయన చూపిన ఐక్యత మార్గంలోనే అందరూ నడవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News