మరో ఉద్దీపన ప్యాకేజీకి కసరత్తు చేస్తున్న కేంద్రం

Update: 2020-10-22 03:57 GMT

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్తేజం నింపేందుకు కేంద్రప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు చేస్తోంది. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఐదు నెలల కిందట ఆత్మనిర్భర్‌ పేరుతో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించింది. ఐతే వృద్ధిని వేగవంతం చేసి ఆర్థిక వ్యవస్ధలో డిమాండ్‌ను ప్రేరేపించేందుకు మరో ప్యాకేజ్‌ను ప్రకటించాలని వివిధ రంగాల నుంచి విన్నపాలు రావడంతో ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు సాగిస్తోంది. ఇక అటు ఈ ఏడాది భారత్‌ వృద్ధి రేటు 10.3 శాతం పతనం అవుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధికి ఊతమిస్తూ, డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలో ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయ్. 

Tags:    

Similar News