Changes in IT Returns Payments: ఐటీ రిటర్న్స్ చెల్లించే వారికి గుడ్ న్యూస్.. ఈ విధానంలో చెల్లింపులు

Changes in IT Returns Payments: కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో మార్పులు చేసుకుంటోంది.

Update: 2020-07-19 04:03 GMT
Income Tax Department

Changes in IT Returns Payments: కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో మార్పులు చేసుకుంటోంది. ప్రతి పనికి కార్యాలయాలకు వచ్చి చేసుకునే విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. అన్ని కార్యాలయాల మాదిరిగా ఐటీ రిటర్న్స్ దాఖాలు చేసే వారికి ఇంటి నుంచే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది.

కరోనా వ్యాప్తితో ప్రభుత్వ వ్యవహారాలు ఆన్ లైన్ లోకి మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ ఆన్ పద్దతిలో ఫిర్యాదులు, సూచనలు, అప్లికేషన్లను తీసుకుంటోంది. ఇదే తరహాలో అవలంభిస్తోంది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్. ప్రతి చిన్న పనికి తమ కార్యాలయానకిి రాకుండా ఈ ఫిల్లింగ్ ద్వారా పన్ను చెల్లింపులు చేసుకునేలా ఈ ఫిల్లింగ్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (CBDT) రెడీ చేసింది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్స్‌ (ITR) చెల్లించుకునే పద్దతిని ప్రవేశపెట్టింది. ఐటీ రిటర్నులు దాఖల చేసేవారికి సువర్ణావకాశాన్ని అందించింది.

టక్స్ చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ-ఫిల్లింగ్ పద్దతిని ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించింది . కొత్తగా 26 AS ఫారంను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా తమ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడమే కాకుండా ఫిర్యాదులు కూడా చేయవచ్చని తెలిపింది. ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులకు 26 AS ఫారం ఎంతో ఉపగపడుతుందని ప్రకటించింది. 26 AS ఫారం సంస్థ అధికారిక వెబ్ సైట్ లో ఉంటుందని ఇన్‌కమ్ టాక్స్ అధికారులు తెలిపారు. పాన్ (PAN) కార్డు ఆదారంగా ఈ 26 AS ఫారం నింపవచ్చని చెప్పారు.

ప్రతి చిన్న విషయానికి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదని తెలిపారు. గడిచిన సంవత్సరం 2019-20 దాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడం కానీ, రివైజ్ చేయడానికి 2020 జులై 31వ తేదీ కానీ ఆఖరు తేదీ. పన్ను చెల్లింపు దారులు తమ సౌలభ్యం, ప్రయోజనం కోసం ఈ ఫిల్లింగ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ఆదాయపు పన్ను విజ్ఞప్తి చేసింది.పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసే గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది.


Tags:    

Similar News