Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లక్నోలో నడిరోడ్డుపై యువతి రచ్చ
Uttar Pradesh: ఓ క్యాబ్ డ్రైవర్‌ను చెంపదెబ్బలు కొడుతూ హల్‌చల్
ఉత్తరప్రదేశ్ లో యువకుడిని కొట్టిన మహిళా (ఫైల్ ఇమేజ్)
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లక్నోలో నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ చేసింది. ఓ క్యాబ్ డ్రైవర్ చెంపలు చెల్లు మనిపిస్తూ హల్ చల్ చేసింది. లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం.. అమ్మాయిని అడ్డుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అసలు ఎందుకు కొడుతున్నావని క్యాబ్ డ్రైవర్ అడగగా అతడి సెల్‌ఫోన్‌ను రోడ్డుకేసి కొట్టింది. అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్ పట్టుకొని పక్కకు లాగి పడేసింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.