ప్రమాణం చేసిన కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ల

Update: 2019-10-31 15:56 GMT

కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌కు కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా గిరీశ్‌ చంద్ర ముర్ము, లద్ధాఖ్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఆర్‌కే మాథూర్‌ ప్రమాణస్వీకారం చేశారు. కశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ఇద్దరి చేత ప్రమాణం చేయించారు. అయితే గిరీశ్‌ చంద్ర ముర్ము ప్రమాణస్వీకారానికి ఇద్దరు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. లోక్‌సభ ఎంపీ జుగల్‌ కిశోర్‌, పీడీపీ కి చెందిన ఎంపీ నజీర్‌ అహ్మద్‌ లావే మాత్రమే రావడం గమనార్హం.

శ్రీనగర్ లో గిరీశ్ చంద్ర ముర్ము ప్రమాణస్వీకారం చేస్తే , లేహ్‌లోలెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఆర్‌కే మాథూర్‌ ప్రమాణం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పలు ఆంక్షలు విధించారు. దీంతో అక్కడ మాజీ ముఖ‌్యమంత్రులను గృహనిర్భంధంలో ఉంచారు. కొందరు నేతలు మాత్రం రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపినట్లు అవుతుందని వారు హాజరుకాక పోవడం గమనార్హం

Tags:    

Similar News