PAN Card: ఆధార్‌ కార్డు ద్వారా సులువుగా పాన్‌కార్డు పొందండి..!

PAN Card: ఆధార్‌ కార్డు ద్వారా సులువుగా పాన్‌కార్డు పొందండి..!

Update: 2022-04-24 11:30 GMT

PAN Card: ఆధార్‌ కార్డు ద్వారా సులువుగా పాన్‌కార్డు పొందండి..!

PAN Card: నేటి కాలంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రాలు. ఆధార్ కార్డు ID రుజువుగా ఉపయోగపడుతుంది. అయితే పాన్ కార్డ్ ఆర్థిక పత్రంగా ఉపయోగపడుతుంది. పిల్లలకి 18 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే పాన్ కార్డును తయారు చేయడం మంచిది. ఎందుకంటే ఇది బ్యాంకు ఖాతా తెరవడానికి అనేక ఇతర ఆర్థిక పనులను చేయడానికి వినియోగిస్తారు. పిల్లల పాఠశాల, కళాశాల అడ్మిషన్ల నుంచి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది.

మీకు ఆధార్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ పొందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీలైనంత త్వరగా పాన్ కార్డ్ పొందవచ్చు. కాబట్టి ఆధార్ కార్డ్ సహాయంతో ఇన్‌స్టంట్ పాన్ కార్డ్‌ని ఎలా పొందాలో తెలుసుకుందాం.

తక్షణ పాన్ కార్డ్ కోసం ఇలా చేయండి..

1. ఆధార్ సాయంతో తక్షణ ఈ-పాన్ కార్డ్‌ని పొందడానికి ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.

2. తర్వాత తక్షణ e-PAN ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.

3. తర్వాత మీరు గెట్ న్యూ పాన్ ఎంపికపై క్లిక్ చేయాలి.

4. ఇక్కడ మీరు ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఐ కన్‌ఫర్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

5. తర్వాత కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

6. తర్వాత మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

7. ఈ OTPని ఎంటర్ చేయండి.

8. తర్వాత వాలిడేట్ అండ్ కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

9. తర్వాత నిబంధనలు, షరతులను అంగీకరించి ఈ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి.

10. తర్వాత ఇతర ఆధారాలను ఎంటర్ చేయండి.

11. తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి.

12. ఆధార్ వివరాలను సమర్పించిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ జారీ అవుతుంది.

13. తర్వాత రసీదు సంఖ్యను ఎంటర్ చేయండి. ఆపై ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, OTPని ఎంటర్‌ చేయండి.

14. అప్పుడు మీరు e-PAN కార్డ్‌కి లింక్ పొందుతారు.

15. దానిపై క్లిక్ చేసి పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయండి (DDMMYYYY ఆకృతిలో).

16. అంతే తక్షణ ఈ పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Tags:    

Similar News