Gautham Adani : రూ.10,000 కోట్ల విరాళం ప్రకటించిన గౌతమ్ అదానీ

Update: 2025-02-08 08:08 GMT

Gautham Adani : రూ.10,000 కోట్ల విరాళం ప్రకటించిన గౌతమ్ అదానీ

Gautham Adani's Rs. 10,000 Cr Donation: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ ఇటీవల వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు. ఆయన ఆహ్మదాబాద్‌లో దివా జేమిన్ షాను వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు. అదానీ ఈ వివాహాన్ని చాలా సింపుల్‌గా పూర్తి చేశారు. గౌతం అదానీ స్థాయి లాంటి ధనికుడు ఇంత సింపుల్ గా పెళ్లి చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద న్యూస్ ఇంకొకటి బయటికొచ్చింది. గౌతమ్ అదానీ వివిధ సామాజిక పనుల కోసం రూ.10,000 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఆరోగ్యం, విద్య మొదలైనవి ఉన్నాయి.

ఈ వివాహం జైన సంప్రదాయం ప్రకారం శాంతి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. ప్రముఖులను ఎవరినీ ఆహ్వానించలేదు. అదానీ శనివారం ఉద్యోగులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. “దేవుని దయవల్ల, జీత్ దివా ఈరోజు వివాహం అనే పవిత్ర బంధంతో ఒక్కటయ్యారు. ఇది ఒక చిన్న, చాలా ప్రైవేట్ కార్యక్రమం. కాబట్టి మేము శ్రేయోభిలాషులందరినీ ఆహ్వానించలేకపోయాం” అని అదానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

10,000 కోట్లు విరాళం

ఈ రూ. 10,000 కోట్ల విరాళం ఆసుపత్రులు , వైద్య కళాశాలల నెట్‌వర్క్‌ను సృష్టించడానికి, ఉత్తమ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ఉపయోగించనున్నారు. గౌతమ్ అదానీకి ఇద్దరు కుమారులు. కరణ్, జీత్. కరణ్ ఇప్పటికే ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురుని వివాహం చేసుకున్నాడు. జీత్ భార్య దివా షా. ఆమె వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. వారికి ముంబై, సూరత్‌లలో వజ్రాల తయారీ కంపెనీ ఉంది.

వివాహ వేడుక మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఇది జైన, గుజరాతీ సంస్కృతి ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. దీనికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. జీత్ అదానీ ఎయిర్ పోర్టులకు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన విమానాశ్రయ వ్యాపారాన్ని చూస్తున్నారు. ఈ వివాహానికి ఎలాన్ మస్క్ నుండి బిల్ గేట్స్ వరకు చాలా మంది ప్రముఖులు హాజరవుతారని, టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన ఇస్తారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. కానీ అవన్నీ ఏవీ లేకుండానే చాలా చాలా సింపుల్‌గా జరిగింది.

Tags:    

Similar News