Gaurav Gogoi: మోడీ మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానం
Gaurav Gogoi: మణిపూర్ మండుతుంటే.. దేశం తగలబడుతోంది
Gaurav Gogoi: మోడీ మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానం
Gaurav Gogoi: మణిపూర్ కోసమే అవిశ్వాస తీర్మానం తెచ్చామన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. మణిపూర్ మండుతుంటే.. దేశం తగలబడుతోందని.. అయినా మణిపూర్ విషయంలో ప్రధాని మోడీ మౌనం వీడటం లేదన్నారు. మౌనాన్ని వీడాలనే అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చామని తెలిపారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించిన గొగోయ్.. ప్రధానికి మూడు ప్రశ్నలు సంధించారు. మణిపూర్‌కు ప్రధాని ఎందుకు వెళ్లలేదని.. మణిపూర్ అల్లర్లపై స్పందించడానికి ప్రధానికి 80 రోజులు ఎందుకు పట్టిందని.. ఇంత జరుగుతున్నా మణిపూర్ సీఎంను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు గొగోయ్.