Gaganyaan: శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ సక్సెస్

Gaganyaan: మాడ్యూల్స్‌ను వెలికితీసిన కోస్ట్‌గార్డు అధికారులు

Update: 2023-10-22 05:21 GMT

Gaganyaan: శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ సక్సెస్

Gaganyaan: గగన్ యాన్ మిషన్‌లో భాగంగా శ్రీహరి కోట నుంచి ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైంది. టీవీ-డీ1 వాహననౌక నింగిలోకి దూసుకెళ్లగా 60.6 సెకన్లకు టెక్నికల్ వెహికల్ నుంచి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం విడిపోయింది. నింగిలోకి 17 కిలోమీటర్లు ప్రయాణించిన రాకెట్.. వివిధ దశల్లో పారాచూట్ విచ్చుకుని మెయిన్ పారాచూట్ సాయంతో క్రూమాడ్యూల్ శ్రీహరికోటకు పది కిలోమీటర్ల దూరంలో సముద్రంలో దిగింది. అయితే శ్రీహరికోట సమీపంలోని సముద్రం నుంచి గగన్‌యాన్ క్రూమాడ్యూల్‌ను వెలికితీశారు కోస్ట్ గార్డు అధికారులు. నౌక ద్వారా మాడ్యూల్స్‌ను వెలికితీసి భూమ్మీదకు తెచ్చారు కోస్ట్ గార్డ్ అధికారులు.

Tags:    

Similar News