Venkaiah Naidu: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలనం వ్యాఖ్యలు
Venkaiah Naidu: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలనం వ్యాఖ్యలు చేశారు.
Venkaiah Naidu: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలనం వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో జరిగిన సంఘటన బాధాకరమన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు పార్టీ మారదలిస్తే, ఆ పార్టీ ద్వారా పొందిన పదవిని త్యాగించి, రాజీనామా చేయాలన్నారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని సవరించాల్సిన అవసరముందని తెలిపారు.
రాష్ట్రాల్లో అప్పులు చేసే ముందు ఎందుకు చేస్తున్నారో.. వాటికి సంబంధించిన విషయాలు అసెంబ్లీ ముందు ఉంచి చర్చించాలన్నారు. చేసే అప్పులు అభివృద్ధి, ప్రగతి పురోగతికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసులుపై రెండేళ్లలోపే విచారణ జరగాలి, ప్రభుత్వాలు కోర్టుల సంఖ్యలు పెంచాలి, జడ్జీలని నియమించాలని వెంకయ్య నాయుడు కోరారు.