కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ..కేంద్ర మాజీ మంత్రి రాజీనామా

పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపిన అశ్వినీ కుమార్

Update: 2022-02-15 12:44 GMT

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ..కేంద్ర మాజీ మంత్రి రాజీనామా

Ashwani Kumar: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్​నేత, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ మంగళవారం..ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్‌తో తనకున్న 46 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికారు. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ వెలుపలే ఉత్తమంగా సేవ చేయగలనని ఆయన రాజీనామా లేఖలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన గౌరవానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

స్వాతంత్య్ర సమరయోధులు ఊహించిన ఉదార ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాను అని రాజీనామా లేఖలో తెలిపారు. అశ్వనీ కుమార్​ 2002 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2012 అక్టోబరు 28 నుంచి 2013 మే 10 వరకు కేంద్ర​ న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.ఇటీవల సీనియర్​నేత ఆర్‌పీఎన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈ రాజీనామాకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్ వంటి సీనియర్​ నేతలు కూడా పార్టీని వీడారు.

Tags:    

Similar News