Five States Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలివీ...
Exit Polls: యూపీ పీఠం మళ్లీ కమలం పార్టీదే అంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ కన్ఫాం చేశాయి.
Five States Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలివీ..
Exit Polls: యూపీ పీఠం మళ్లీ కమలం పార్టీదే అంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ కన్ఫాం చేశాయి. యూపీలో మొత్తం 403 సీట్లకు 200కు పైగా సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ ఇలా అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. ఇటు పంజాబ్‌లో అప్ దే విజయమంటూ అన్ని సర్వేలు ఢంకా మోగిస్తున్నాయి. గోవాలో మరోసారి హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చెబుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. ఇక మణిపూర్‌లో మాత్రం బీజేపీ మెజార్టీ మార్క్ దిశగా పరుగులు పెట్టడం ఖాయమంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.