యూపీ బాగ్‌పత్‌లో కుప్పకూలిన వేదిక: ఐదుగురి మృతి
ఉత్తర్‌ప్రదేశ్ మంగళవారం బాగ్‌పత్ లో లడ్డూ మహోత్సవంలో వేదిక కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు.
యూపీ బాగ్‌పత్‌లో కుప్పకూలిన వేదిక: ఐదుగురి మృతి
Watchtower Collapsed: ఉత్తర్‌ప్రదేశ్ మంగళవారం బాగ్‌పత్ లో లడ్డూ మహోత్సవంలో వేదిక కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనస్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
లడ్డూ మహోత్సవం కోసం వెదురు కర్రలతో వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వందలాది మంది భక్తులు వస్తారు. వేదిక కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ చర్యలు చేపట్టింది. జైన మతానికి చెందిన భక్తులు ఈ ఉత్సవంలో పెద్దఎత్తున పాల్గొంటారు.