అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం.. మూడ్రోజుల్లో ఐదుగురు మృతి

*జూన్‌ 30న ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

Update: 2022-07-03 12:30 GMT

అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం.. మూడ్రోజుల్లో ఐదుగురు మృతి

Amarnath Yatra 2022: కైలాసవాసుడిని దర్శించుకోవాలని వెళ్తున్న భక్తులు... మృత్యువాత పడుతున్నారు. అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైన మూడ్రోజులకే వేర్వేరు కారణాలతో ఐదుగురు మృతి చెందారు. ఢిల్లీకి చెందిన జై ప్రకాశ్‌, బరేలికి చెందిన 53 ఏళ్ల దేవేందర్‌ టయల్, బీహార్‌కు చెందిన 40 ఏళ్ల లిపో శర్మ, మహారాష్ట్రకు చెందిన 61 ఏళ్ల జగన్నాథ్, రాజస్థాన్‌కు చెందిన 46 ఏళ్ల ఆషు సింగ్‌ యాత్రలో వేర్వేరు ప్రాంతాల్లో మృతి చెందారు.

ఇప్పటివరకు అమరనాథుడిని 40వేల మంది దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. జూన్‌ 30న ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 11 వరకు సాగనున్నది. కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గామ్‌, గండేర్బాల్‌ జిల్లాలోని బాల్టాల్‌ మార్గంలో భక్తులు అమర్‌నాథ్‌కు చేరుకుని మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటారు.

Tags:    

Similar News