Rajasthan: రాజస్థాన్‌లో తొలి వందే భారత్ రైలు ప్రారంభం
Rajasthan: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ
Rajasthan: రాజస్థాన్‌లో తొలి వందే భారత్ రైలు ప్రారంభం
Rajasthan: రాజస్థాన్ లో తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అజ్మీర్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ వరకు వెళ్లే వందే భారత్ జైపూర్ మీదుగా 5 గంటల 15 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుతుంది. ఇంతకు మునుపు శతాబ్ది ఎక్స్ ప్రెస్ అదే మార్గంలో అత్యంత వేగంగా నడిచే రైలు కాగా 6 గంటల 15 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరేది. వందే భారత్ రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం తగ్గనుంది.. దీంతో ప్రయాణీకులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.