Vande Bharat Express: కేరళలో ప్రారంభమైన తొలి వందే భారత్ రైలు

Vande Bharat Express: 11 జిల్లాల మీదుగా వందేభారత్‌ రైలు రాకపోకలు

Update: 2023-04-25 08:31 GMT

Vande Bharat Express: కేరళలో ప్రారంభమైన తొలి వందే భారత్ రైలు

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించేందుకు కేరళ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. కేరళ గవర్నర్ అరిఫ్ మొహ్మద్ ఖాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. ఇందులో భాగంగా తిరువనంతపురంలో తొలి వందే భారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మెట్రో ఎక్కి కొద్దిసేపు ప్రయాణికులతో ముచ్చటించారు. కేరళలో మొట్టమొదటి సారిగా ఈ రైలు పట్టాలెక్కబోతోంది. తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ మధ్య పరుగులు పెట్టనుంది. మొత్తంగా 11 జిల్లాల మీదుగా ఈ వందేభారత్‌ రైలు రాకపోకలు సాగించబోతోంది. ఇది దేశంలో 16వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కావడం మరో విశేషం.

Tags:    

Similar News