Coronavirus: మధ్యప్రదేశ్‌లో తొలి కరోనా మరణం..

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పరుగులు తీస్తోంది కరోనా వైరస్. సకల మానవాళిని గడగడలాడిస్తోంది. చైనా లో కరోనా తీవ్రత తగ్గిందని వార్తలు వచ్చాయి.

Update: 2020-03-25 15:11 GMT
Representational Image

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పరుగులు తీస్తోంది కరోనా వైరస్. సకల మానవాళిని గడగడలాడిస్తోంది. చైనా లో కరోనా తీవ్రత తగ్గిందని వార్తలు వచ్చాయి. అటు తరువాత ప్రపంచంలో పలు దేశాల్లో కరోన వ్యాప్తి పెరిగిపోయింది. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఇరాన్ లు ఇప్పుడు కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి.

స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ప్రాంతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ మంగళవారం నాటికి 12 వేల మందికిపైగాకోవిడ్ బారిన పడ్డారు. 1500 మందికిపైగా చనిపోయారు. రోజుకు 700 మంది వరకు చనిపోతుండటంతో శవాలను ఖననం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తుతోంది.

అయితే ఈ తరుణంలో మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో తోలి కరోనా మరణం చోటుచేసుకుంది. ఉజ్జయినికి చెందిన 65 ఏళ్ల మహిళ ఇండోర్‌లో కరోనా వైరస్‌కు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. దీంతో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 11కు చేరింది.


Tags:    

Similar News