CISF Recruitment 2022: ఇంటర్ చదివిన వారికి శుభవార్త.. CISFలో కానిస్టేబుల్ పోస్ట్‌లు..

CISF Recruitment 2022: సెంట్రల్ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) నుంచి జాబ్ నోటిఫికేషన్‌ విడుదలైంది.

Update: 2022-02-01 15:00 GMT

CISF Recruitment 2022: ఇంటర్ చదివిన వారికి శుభవార్త.. CISFలో కానిస్టేబుల్ పోస్ట్‌లు..

CISF Recruitment 2022: సెంట్రల్ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) నుంచి జాబ్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్ చదివిన విద్యార్థులు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 29 నుంచి ప్రారంభమయ్యాయి. అర్హత గల అభ్యర్థులు 04 మార్చి 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ రిక్రూట్‌ మెంట్ జరుగుతోంది. ఇందులో మొత్తం 1149 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు CISF అధికారిక వెబ్‌సైట్, cisf.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత & వయో పరిమితి

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 ఏళ్లు, 23 ఏళ్లు మించకూడదు. అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80-85 సెంటీమీటర్లు ఉండాలి. అర్హతకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించండి.

ఖాళీ వివరాలు

CISF మొత్తం 1149 కానిస్టేబుల్ లేదా ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తుంది. వీటిలో జనరల్ కేటగిరీకి 489 సీట్లు ఖరారు చేశారు. మరోవైపు, ఓబీసీకి 249, ఈడబ్ల్యూఎస్‌కు 113, ఎస్సీకి 161, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 137 సీట్లు భర్తీ కానున్నాయి.

ఎంపిక ఇలా ఉంటుంది..?

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికవుతారు. చివరగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

Tags:    

Similar News