ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో 27 మంది మృతి

Delhi: ముండ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని భవనంలో మంటలు

Update: 2022-05-14 01:17 GMT

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమదం సంభవించింది. ముండ్కా ఏరియాలోని నాలుగంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 27 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రమాద సమయంలో భవనంలో 60 నుంచి 70 మంది వరకు ఉన్నారు. దీంతో ప్రమాధ స్థాయి తీవ్రమైంది. మంటలను 30 ఫైరింజన్లతో అదుపులోకి తెచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది.

పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్‌ సమీపంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో సాయంత్రం 4గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి చాలా మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోంచి కొందకు కిందకు దూకేశారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భననంలోని మొదటి అంతస్తులో సీసీటీవీ కెమెరాలు, రూట్ల తయారీ సంస్థ ఉంది. అందులోనే మొదట మంటలు చెలరేగి పై అంతస్తులకూ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్రప్రభుత్వం 2 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే గాయాలపాలైన వారికి 50 వేలు చెల్లిస్తామని ప్రకటించింది కేంద్రం. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News