Aiims Delhi: ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్నిప్రమాదం
Aiims Delhi: ఢిల్లీలోని ఆల్ ఎయిమ్స్ లోని 9వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
Aiims Delhi:(File Image)
Aiims Delhi: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 9వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి 10.32 గంటల సమయంలో జరిగింది. డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, పరీక్షా విభాగాలు ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలో ఎయిమ్స్ సెట్ (స్కిల్స్, ఈ-లెర్నింగ్, టెలిమెడిసిన్) సౌకర్యం, ఆడిటోరియం ఉన్నాయి. మంటలు చెలరేగిన వెంటనే 22 ఫైర్ టెండర్లను తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక శకటాలు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన అంతస్తును కొవిడ్ పరీక్షలు చేయడానికి ఉపయోగిస్తారని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు.