Wrestler Sushil Kumar: ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు?
Sushil Kumar Wrestler: ఇండియన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
Wrestler Sushil Kumar
Sushil Kumar Wrestler: ఢిల్లీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల రెజ్లర్ చనిపోయాడు. అయితే బాధితుడి మరణంలో ఇండియన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్దూ మాట్లాడుతూ.. '' ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు చెందిన ఇంట్లో సాగర్, అతని స్నేహితులు ఉంటున్నారు. అయితే వారిని ఖాళీ చేయమని సుశీల్ కుమార్ కోరారు. ఆ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని" తెలిపారు.
"తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో మోడల్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సాగర్ కుమార్ మృతి చెంది ఉన్నాడు. సోను మహల్ (35), అమిత్ కుమార్ (27) లుగా గుర్తించినట్లు తెలిపారు. దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్ చేశామని, పార్క్ చేసిన ఓ వాహనంలో గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు" ఆయన అన్నారు.
ఈ ఘటనలో సుశీల్ కుమార్ హస్తం ఉందని తేలిందని, అతనిపై ఎఫైఆర్ నమోదైందని ఆయన వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా సుశీల్ కుమార్ కోసం వాళ్ల ఇంట్లో సోదాలు చేశాం. అక్కడ సుశీల్ లేడు. పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.