Budget Meeting: నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Budget Meeting: నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Update: 2022-02-01 02:06 GMT

నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Budget Meeting: బడ్జెట్‌కు వేళైంది. మరికొద్దీ గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే.. ఈ బడ్జెట్‌లో తమకు ఊరట కల్పిస్తారని, ఉపశమన చర్యలు ఉంటాయని ఆయా రంగాలు ఎదురుచూస్తున్నాయి. ఇటు సామాన్య జనం సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు.

కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సర్వం సిద్ధమైంది. వరుసగా నాలుగోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న 10వ బడ్జెట్. అయితే సంప్రదాయ బ్రీఫ్‌కేస్‌ను నిర్మలా సీతారామన్ పక్కన పెట్టేశారు. బ్రీఫ్‌కేస్ బదులు భారత సంప్రదాయం ప్రకారం ఎర్ర రంగు గుడ్డలో పెట్టి దారంతో కట్టిన ఫైలును మొదటి సారిగా తీసుకువచ్చారు నిర్మల.

సాధారణంగా బడ్జెట్ అనగానే రకరకాల డిమాండ్స్.. కోరికలు.. ఆశలు వ్యక్తం అవుతూ వస్తాయి. వీటితో పాటు కేంద్రంలో పాలనలో ఉండే పార్టీ రాజకీయ ప్రయోజనాలను బేరీజు వేసుకుంటుంది. అందుకే బడ్జెట్ కు ఆర్థిక ప్రాధాన్యతే కాకుండా రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంటుంది.

ఈసారి అత్యంత కీలకమైన రాష్ట్రాలకు కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇటు వివిధ రాష్టాల నుంచి వచ్చే డిమాండ్స్.. కోరికల చిట్టాకూ లోటులేదు. దక్షిణ రాష్ట్రాల నుంచి భారీగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి కేంద్రం ఏ రాష్ట్రాలను సంతృప్తి పరుస్తుందో చూడాలి.

Tags:    

Similar News