FASTag Annual Pass: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15 నుంచి ప్రారంభం.. గడ్కరీ కీలక ప్రకటన!

Update: 2025-06-18 08:31 GMT

FASTag Annual Pass: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15 నుంచి ప్రారంభం.. గడ్కరీ కీలక ప్రకటన!

FASTag Annual Pass: దేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రయాణదారుల కోసం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమైంది. అదే కొత్త FASTag Annual Pass.

ఈ పాస్‌ను తీసుకున్న ప్రయివేటు వాహనదారులకు ప్రయాణం మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో సాగుతుంది. గడ్కరీ ప్రకటన ప్రకారం ఈ FASTag వార్షిక పాస్ ధర రూ. 3,000గా నిర్ణయించారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ పాస్ అమల్లోకి రానుంది.

ఈ పాస్ ఉపయోగంలో ఉండే గడువు రెండు విధాలుగా పరిగణిస్తారు:

ఒకటి, పాస్ కొనుగోలు చేసిన రోజు నుంచి ఒక సంవత్సరం వరకు.

రెండోది, 200 జర్నీలు పూర్తయ్యే వరకు.

ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తైతే, పాస్ ముగిసినట్టే. ఉదాహరణకు, సంవత్సరం ముగిసేలోపు 200 జర్నీలు పూర్తైతే, ఆ పాస్ ఇక అమలులో ఉండదు. అలాగే, 200 జర్నీలు పూర్తికాకపోయినా, ఒక సంవత్సరం అయిన తర్వాత పాస్‌కి గడువు ముగుస్తుంది.

ప్రస్తుతానికి ఈ వార్షిక పాస్‌ను కేవలం కార్లు, జీపులు, వాన్‌లు వంటి ప్రయివేటు వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. బస్స్‌లు, లారీలు, వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు.

ఈ నిర్ణయం రోడ్లపై ట్రాఫిక్ క్లియర్‌గా ఉండేందుకు, టోల్ గేట్ వద్ద టైమ్ సేవ్ చేసేందుకు మరియు వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు దోహదపడనుంది. FASTag వాడకాన్ని మరింత పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టింది.

వాహనదారులు ఇప్పటికే ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి ఈ పాస్‌కు ఎలా అప్లై చేయాలి, పూర్తి గైడ్‌లైన్‌ల కోసం కేంద్రం త్వరలోనే అధికారిక వివరాలు విడుదల చేయనుంది.

Tags:    

Similar News