Covid Victims: కోవిడ్ బాధిత కుటుంబాలకు పెన్షన్

Covid Victims: కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

Update: 2021-05-30 00:42 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Covid Victims: కరోనా కుటుంబాలకు కుటుంబాలకే ఛిద్రం చేసేస్తోంది. కుటుంబానికి పెద్దగా ఉండి పోషించేవాళ్లే కరోనా బారిన పడి చనిపోతుంటే.. ఆ కుటుంబాలు అనాథ కుటుంబాలుగా రోడ్డున పడుతున్నాయి. పిల్లల చదువులు, అసలు రోజువారీ బతుకే కష్టంగా మారిపోతున్నాయి. దీని కోసం కేరళ, మధ్యప్రదేశ్, ఇంకా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. ఆయా కుటుంబాలకు పెన్షన్ సౌకర్యం, పిల్లలకు చదువులాంటి వాటిని కల్పించేలా పథకాలు రూపొందించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సైతం అదే బాట పట్టారు. పీఎం కేర్ ద్వారా ఆయా కుటుంబాలను ఆదుకోనున్నట్లు ప్రకటించారు.

కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ద్వారా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను లేదా వారిలో ఏ ఒక్కరినైనా కోల్పోయిన చిన్నారులకు సైతం పీఎం కేర్స్ నిధి ద్వారా 18 ఏళ్లు నిండగానే నెలవారీ భృతిని అందజేయనున్నట్లు పేర్కొంది. 23 ళ్లు నిండిన తర్వాత రూ.10 లక్షలు అందించనున్నట్లు ప్రధాని కారాయలయం వెల్లడించింది. చిన్నారులకు ఉన్నత విద్య కోసం రుణ సదుపాయం కల్పించడంతో పాటు ఆ మొత్తానికి సంబంధించిన వడ్డీని పీఎం కేర్స్ చెల్లిస్తుందని తెలిపింది. కోవిడ్ బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పథకాలు వారి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తాయని తెలిపారు.

కోవిడ్ తో మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం సగటు రోజు కూలీలో 90శాతం సొమ్మును పెన్షన్ గా అందజేస్తారు. గతేడాది మార్చి24 నుంచి 2022 మార్చి 24 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగుల బీమా పథకం అనుసరించి ఇచ్చే గరిష్ట బీమా మొత్తాన్నా రూ.6 లక్షల నుంచి 7లక్షలకు పెరిగింది. కనిష్ట బీమా కింద రూ.2.5 లక్షలను ఇచ్చే పథకాన్ని కూడా పునరద్ధించాం. ఈ పథకం గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్ల పాటు వర్తిస్తుంది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకలను కార్మక మత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది. అని ప్రభుత్వం వివరించింది.

Tags:    

Similar News