భారీగా నకిలీ నోట్ల రాకెట్ : షాకైన పోలీసులు

Update: 2020-06-11 08:15 GMT

మహరాష్ట్రలోని పుణేలో భారీ ఎత్తున నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయింది. మిలటరీ ఇంటెలిజెన్స్, పూణే సిటీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో బుధవారం కోట్ల రూపాయల విలువ కలిగిన 'చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అని గుర్తుతో ఉన్న ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు పౌరులతో పాటు ఒక ఆర్మీ జవాన్‌ను కూడా అరెస్టు చేశారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సహకారంతో నిర్వహించిన దాడిలో ఒక జవానుతో పాటు మరికొందరు దొంగ నోట్లను ముద్రిస్తున్నారని గుర్తించారు.

వీటిలో వెయ్యి రూపాయల నోట్లను మినహాయించి రూ. 43.4 కోట్లు స్వదేశీ నోట్లు, రూ. 4.2 కోట్లు విదేశీ కరెన్సీని ముద్రించారు. ఈ కరెన్సీని పెద్దఎత్తున మార్చేందుకు ప్లాన్లు వేసుకున్నారు. అయితే ఈ ఇది మిలటరీ ఇంటెలిజెన్స్ కు తెలియడంతో ముంబై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన సిబ్బంది నకిలీ నోట్ల ముఠాను అదుపులోకి తీసుకుంది. కాగా కోట్లాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ కరెన్సీని చూసి పోలీసు ఉన్నతాధికారులు షాక్ అయ్యారు.


Tags:    

Similar News