Corona: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి

Corona: గత 24 గంటల్లో 2,34,692 కరోనా పాజిటీవ్ కేసులు * మహారాష్ట్ర, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కేసులు అధికం

Update: 2021-04-18 04:00 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona: దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్‌లో కరోనా వణికించేస్తోంది. పోజిటీవ్ కేసులు, మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మహారాష్ట్ర, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కేసులు అధికమవడంతో ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ అవసరాలు అధికమయ్యాయి. దేశంలోని 16 రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా దిల్లీలో ప్రకటించిన వారాంతపు కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి అమలులోకి వచ్చింది. ఇది సోమవారం ఉదయం 5 గంటల వరకూ కొనసాగనుంది.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 34 వేల 692 మందికి కరోనా సోకింది. అలాగే 1,341 మంది మృత్యువాత పడ్డారు. గత వారం రోజుల్లో 63% కేసులు, 66% మరణాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా మూడోరోజు 2 లక్షలకుపైగా కేసులు, వెయ్యికిపైగా మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, వెంటిలేటర్ల సరఫరాను పెంచాలని కేంద్రాన్ని 11 రాష్ట్రాలు కోరాయి.

Tags:    

Similar News