హరియాణాలో ఎగ్జిట్‌ ఫోల్స్‌ అంచనాలు తలకిందులు

హరియాణా శాసనసభ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైయ్యాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 90 నుంచి 70 సీట్లు వస్తాయని తెలిపాయి.

Update: 2019-10-24 14:46 GMT

హరియాణా శాసనసభ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైయ్యాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 90 నుంచి 70 సీట్లు వస్తాయని తెలిపాయి. అయితే ప్రస్తుత ఫలితాలను చూస్తే బీజేపీకి 40 సీట్లు కాంగ్రెస్‌కు 31 స్థానాలు, జేజేపీ 10 స్థానాలు ఇతరులు 8 స్థానాల్లో గెలుచాయి.ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి 58 శాతం ఓట్లు పోలైయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి 36 శాతం ఓట్లు పోలైయ్యయి.

తాజాగా వచ్చిన ఫలితాలు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనోహర్ లాల్ ఖట్టర్ ను నియమింది. దీంతో జాట్లకు ఆ పార్టీకి దూరమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో హరియాణా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు షాక్ ఇచ్చాయి. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి.

Tags:    

Similar News