సీబీఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డైరెక్టర్ అలాగే మణిపూర్‌, నాగాలాండ్‌ గవర్నర్ గా‌ పనిచేసిన వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ చావ్లా ధృవీకరించారు.

Update: 2020-10-08 01:18 GMT

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డైరెక్టర్ అలాగే మణిపూర్‌, నాగాలాండ్‌ గవర్నర్ గా‌ పనిచేసిన అశ్వనీ కుమార్‌ బుధవారం సిమ్లాలో ఆత్మహత్య చేసుకున్నట్లు సిమ్లా పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ చావ్లా ధృవీకరించారు. అశ్వనీ కుమార్‌ తన నివాసంలో ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు.. 37 సంవత్సరాలపాటు కేంద్ర ప్రభుత్వంతో పాటు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలోనూ ఉన్నత పదవులు నిర్వహించారు. 1973 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారు.. ఆగస్టు 2006 లో హిమాచల్ ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గా బాధ్యతలు స్వీకరించారు, ఈ పదవిలో జూలై 2008 వరకు కొనసాగారు. రెండు సంవత్సరాల తరువాత, సిబిఐ డైరెక్టర్ గా ఎంపికయ్యారు.

2008 ఆగస్టు 2 నుండి 2010 నవంబర్ 30 వరకూ ఈ పదవిలో ఉన్నారు. ఆ తరువాత 21 మార్చి 2013 న నాగాలాండ్ 17 వ గవర్నర్‌గా, 29 జూలై 2013 న మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎలైట్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపులో ఉన్నత పదవులను కూడా నిర్వర్తించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భద్రతా అధికారి గాను కూడా ఆయన పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ అనే చిన్న పర్వత పట్టణం లో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్యాబ్యాసం అంతా అక్కడే జరిగింది. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. గవర్నర్‌గా పదవీకాలం ముగిసిన తరువాత, ఎపి గోయల్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా ఆయన పనిచేశారు. అశ్వని కుమార్ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు, సీనియర్ ఐపీఎస్ అధికారులు నివాళులు అర్పించారు.

Tags:    

Similar News