EPFO: పీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. మీ జీతం 15000 వేల కంటే ఎక్కువగా ఉందా..?

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. మీ జీతం 15000 వేల కంటే ఎక్కువగా ఉందా..?

Update: 2022-02-22 02:15 GMT

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. మీ జీతం 15000 వేల కంటే ఎక్కువగా ఉందా..?

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రూ.15,000 కంటే ఎక్కువ బేసిక్ జీతం పొందే ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పెన్షన్ స్కీమ్-1995 (EPS-95) కింద కవర్ చేయని ఉద్యోగుల కోసం ఈ పెన్షన్ ఉంటుంది. ప్రస్తుతం రూ. 15,000 వరకు బేసిక్‌ జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా EPS-95 కింద కవర్ అవుతున్నారు. ఇప్పటికే కనీస పెన్షన్ పెంచాలని ఖాతాదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

అందువల్ల నెలవారీ బేసిక్‌ వేతనం రూ.15,000 కంటే ఎక్కువ ఉన్న వారి కోసం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన గురించి మార్చి 11, 12 తేదీల్లో గౌహతిలో జరిగే EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో చర్చిస్తారు. అలాగే 2021, నవంబర్‌లో పెన్షన్ సమస్యలపై ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ కూడా తన నివేదికను సమర్పించనుంది. అయితే రూ.15,000 కంటే ఎక్కువ బేసిక్ జీతం పొందుతున్న ఉద్యోగులు చాలా మంది EPFOలో ఖాతాదారులుగా ఉన్నారు.

ప్రస్తుతం వారందరు EPS-95 కింద 8.33 శాతం తక్కువ రేటుతో డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో వారికి తక్కువ పెన్షన్ వస్తుంది. EPFO 2014లో నెలవారీ పెన్షనబుల్ బేసిక్ జీతం రూ.15,000కే పరిమితం చేసింది. అయతే ఉద్యోగుల వేతన సవరణ, ధరల పెరుగుదల కారణంగా సెప్టెంబర్ 1, 2014 నుంచి మరో రూ.6,500 పైకి తీసుకొచ్చారు. తర్వాత నెలవారీ కనీస వేతన పరిమితి రూ.25వేలకు పెంచాలనే డిమాండ్‌పై చర్చ జరిగినా ఆ ప్రతిపాదనకు ఎటువంటి ఆమోదం లభించలేదు. పరిశ్రమ అంచనాల ప్రకారం బేసిక్ పెంచితే సంఘటిత రంగంలో 50 లక్షల మంది కార్మికులు EPS-95 పరిధిలోకి రావచ్చు. 

Tags:    

Similar News