Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

Jammu Kashmir: ఉగ్రవాది అకిబ్ ముస్తాక్ భట్‌ను హతమార్చిన భద్రతా బలగాలు

Update: 2023-02-28 05:59 GMT

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని అవంతిపొరా మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాదిని అకిబ్ ముస్తాక్ భట్‌గా గుర్తించారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అకిబ్ భట్.. రెండు రోజుల క్రితం పుల్వామాలో కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మను హత్య చేశాడని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్య తర్వాత ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పుల్వామా జిల్లా అవంతిపొరా ఏరియాలోని పద్గపొర గ్రామంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు పారిపోయారు. వారికోసం కూంబింగ్ ముమ్మరం చేశారు. 

Tags:    

Similar News