Elon Musk: ఎలన్ మస్క్ భారత్ టూర్ వాయిదా
Elon Musk: మస్క్ పర్యటన రద్దు అయినట్లు వెల్లడి
Elon Musk: ఎలన్ మస్క్ భారత్ టూర్ వాయిదా
Elon Musk: టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్... భారత్ టూర్‌ను రద్దు చేసుకున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీతో మస్క్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ పర్యటనను మస్క్ రద్దు చేసుకున్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇండియాలో కార్ల ప్రాజెక్టుపై మస్క్ ప్రకటన చేస్తారని కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో సుమారు మూడు బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. దాదాపు 25 లక్షలు ఖరీదు చేసే మోడల్ 2 రకం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్రి కోసం ఆ ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఢిల్లీలో జరగనున్న స్పేస్ స్టార్టప్స్ కంపెనీలతో మస్క్ భేటీ కావాల్సి ఉంది.